సీనియర్ నటి అన్నపూర్ణ పై ఫైర్ ఐన చిన్మయి...
on Feb 25, 2024
సీనియర్ నటి అన్నపూర్ణ మీద ఫుల్ ఫైర్ అయ్యింది చిన్మయి శ్రీపాద. అన్నపూర్ణ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆడవాళ్ళ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. "ఇంతకు ముందు రోజుల్లో ఆడవాళ్లు అర్ధరాత్రి బయటకు వచ్చేవాళ్ళు కాదు...ఆడదానికి స్వతంత్రం ఎందుకు కావాలి, అర్ధరాత్రి 12 తర్వాత ఎం పని..ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. వాళ్ళు అనొద్దన్నా అనేలా వెళ్తున్నామే మనం... ఎప్పుడూ ఎదుటి వాళ్లదే తప్పు అనకూడదు..మనది కూడా కొంచెం ఉంటుంది"..అంటూ చేసిన ఈ కామెంట్స్ మీద చిన్మయి శ్రీపాద రెస్పాండ్ అయ్యింది. "నాకు ఆమె నటన ఇష్టం..ఆమెకు నేను పెద్ద ఫ్యాన్ ని కూడా. ఇలాంటి ఫేవరేట్ అనుకునేవాళ్ళు ఇలాంటి సలహాలు ఇస్తుంటే గుండె బద్దలైపోతుంది.
ఆమె చెప్పిన రూల్స్ ప్రకారం చూస్తే...యాక్సిడెంట్స్ కానీ ఏవైనా కానీ ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకే జరగాలి..ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు. ఇదే రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పూట పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండకూడదు కాబట్టి. జుట్టు చిన్నగా, బొట్టు పెట్టుకోకుండా, పొట్టి డ్రెస్సులు వేసుకుంటే రేప్ చేస్తారు కాబట్టి బయటకు రాకూడదు..భారతదేశంలో అందునా అమ్మాయిలుగా పుట్టడం నిజంగా కర్మ..2024 లో ఉన్నా కూడా ఇంకా మన భారత దేశంలో అమ్మాయిలకు చదువెందుకు, ఉద్యోగం ఎందుకు అనే పరిస్థితిలోనే ఉన్నాం. మన కర్మ కాలిందిరో" అని కామెంట్ చేసింది చిన్మయి. ఇక అన్నపూర్ణ చేసిన ఆ కామెంట్స్ ని నెటిజన్స్ కూడా తప్పుబడుతున్నారు. "మీరు సినిమాల్లో నటిస్తారు కదా...మీకు అనుకూలమైన టైమింగ్స్ ఉండేవా...? సీత చీర కట్టుకుని సంప్రదాయంగానే ఉంది కదా మరి రావణాసురుడు ఎత్తుకుపోయాడు కదా ..నిజమే ఆడవాళ్ళ ఖర్మ. మన పెద్దవాళ్లందరికీ ఇదే మైండ్ సెట్ ఉంటుంది...ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చి అక్కడ అమ్మాయిల మీద వేసే బాడీ షేమింగ్ జోక్స్ కి నవ్వుతుంది" అంటూ తిడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
